Friday, 17 March 2017

జ్ఞానవిజ్ఞాన యోగము

జ్ఞానవిజ్ఞాన యోగము, భగవద్గీతలో ఏడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

|| 7-1 ||
శ్రీభగవానువాచ|
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు :- నాలో మనస్సును లగ్నం చేసి,యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి,నిస్సశయంగా,క్షుణ్ణంగా ఎలా తెలుసుకో గలవో దానిని గురించి వినుము.

|| 7-2 ||
జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః|
యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే

అనుభవంతో కూడిన శాస్త్ర పరిజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను.దీనిని తెలుసుకున్నాక నీకు వేరే తెలుసుకోవలసినది ఏమీ ఉండదు.

|| 7-3 ||
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః

వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తారు.అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యదార్ధంగా తెలుసుకుంటారు.

|| 7-4 ||
భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా

భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం మరియు మనస్సు బుద్ధి,అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

|| 7-5 ||
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్

ఓ మహానుభాహుడా! ఇది అల్పమైనది.ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ నా పరమైన ప్రకృతి అని తెలుసుకో.దాని వలననే ఈ జగత్తు భరించబడుతుంది.

|| 7-6 ||
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ|
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో.యావత్తు జగత్తుకు యొక్క ఉత్పత్తి,నాశనములకు మూలము నేనే అని తెలుసుకో.

|| 7-7 ||
మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ

ధనుంజయా! నాకన్నా ఏక్కువైనదీ ఏదీలేదు.జగత్తు యావత్తు దారంలో మణులవలె నాలో గుచ్చబడి ఉన్నది.

|| 7-8 ||
రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః|
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు

కౌంతేయా! నేను నీటిలోని రుచిని సూర్యచంద్రులలోని వెలుగును,వేదాలలోని ఓంకారాన్ని,ఆకాశంలో ఉన్న శబ్ధ గుణాన్ని.మానవులలోని పట్టుదలను.

|| 7-9 ||
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు

నేను పృథ్విలోని వాసనని.అగ్నిలోని వేడిని.జీవుళ్ళలోని ప్రాణాన్ని.తపస్సు చేసేవారిలో తపస్సుని.

|| 7-10 ||
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్

అర్జునా అందరి జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో.బుద్ధిమంతుల లోని తెలివిని.ప్రతిభా వంతుల లోని ప్రతిభని నేను.

|| 7-11 ||
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|
ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని నేను.జీవులలో ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.

|| 7-12 ||
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే|
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి

ఇంకా ఏవి తామసిక,రాజసిక,సాత్విక భావాలో అవన్నీ నా వలన వస్తాయని గ్రహించు.అయితే నేను వాటిలో లేను అవినాలో ఉన్నాయి.

|| 7-13 ||
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్|
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్

మూడుగుణాలలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచం యావత్తూ బ్రాంతిలో పడి,వీటికన్నా అతీతమూ,అవ్యయమూ అయిన నన్ను గుర్తించలేదు .

|| 7-14 ||
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే

దివ్యమైన,త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది.నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

|| 7-15 ||
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః

దుర్మార్గులు మూఢులు,మాయ చేత జ్ఞానం నశించిన వారు,అసురభావాన్ని ఆశ్రయించిన వారు ఐన నరాధములు నన్ను సేవించరు.

|| 7-16 ||
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున|
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ

భరత కుల శ్రేష్టుడైన ఓ అర్జునా! ఆర్తుడూ,జిజ్ఞాసువూ,అర్ధార్ధీ,జ్ఞాని అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు.

|| 7-17 ||
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే|
ప్రియో హి జ్ఞానినోऽత్యర్థమహం స చ మమ ప్రియః

ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు.అటువంటి వాడికి నేను ఎక్కువ ప్రియుణ్ణి.అతడే నాకు కూడా ఇష్టుడు.

|| 7-18 ||
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్

వీరందరూ ఉదారులే.జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా అభిప్రాయము .ఎందుకంటే అతడే సర్వోత్తమైన గతి అని నన్నే ఆశ్రయించి ఉంటాడు.

|| 7-19 ||
బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః

అనేక జన్మల తరువాత నరుడు జ్ఞాన వంతుడై సర్వమూ వాసుదేవుడని నన్ను కొలుస్తాడు.అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు

|| 7-20 ||
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేన్యదేవతాః|
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం హరించుకు పోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర దేవతలను ఆరాధిస్తారు.

|| 7-21 ||
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి|
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని కోరతాడో ఆయా భక్తునికి ఆయాదేవతయందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను.

|| 7-22 ||
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే|
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు.నాచే ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతారూపంద్వారా పొందుతాడు .

|| 7-23 ||
అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి

అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా ఉంటుంది.దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు,నన్ను ఆరాధించేవారు నన్ను చేరుతారు.

|| 7-24 ||
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః|
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్

పరమము,సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని,తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరంకాని పరిమితమైన రూపంగా భావిస్తారు.

|| 7-25 ||
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః|
మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను.నన్ను ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివాణ్ణిగా తెలుసుకో లేదు.

|| 7-26 ||
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున|
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన

నేను గతించిన జీవులను,ఇప్పుడు ఉన్నవాళ్ళనూ,ముందు పుట్టబోయే వారినీ ఎరుగుదును.నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు.

|| 7-27 ||
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత|
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వందాల మోహం వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నాయి.

|| 7-28 ||
యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్|
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః

పుణ్య కర్మల వలన ఏజనులయొక్క పాపం అంత మైనదో,వాళ్ళు,ద్వంద మోహాలనుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు.

|| 7-29 ||
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే|
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్

జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆబ్రహ్మమూ ఆత్మ తత్వాన్ని యావత్తు కర్మనీ తెలుసుకుంటారు.

|| 7-30 ||
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః|
ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః

ఆధి భూతంతో,ఆధిదైవంతో,ఆధియజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళుమనస్సు వశంలో ఉంచుకుని ప్రయాణ కాలంలోకూడా నన్ను గుర్తుంచుకుంటారు.

|| 7 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
కృష్ణుడు:
నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.నా ఈ ప్రకృతి భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనసు,బుద్ది,అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు.

దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది.

నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంతి,వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే.

త్రిగుణాలన్ని నా ఆధీనమే,నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతున్ని ఐన నన్ను తెలుసుకోలేకపోతున్నారు.

త్రిగుణాతీతమూ,దైవతమూ ఐన నా మాయ దాటడానికి సాధ్యము కాదు.ఐనా నన్ను శరణు జొచ్చువారికి అది సులభసాధ్యము. రాక్షసభావులూ,మూఢులూ,మూర్ఖులూ,నీచులూ నన్ను పొందలేరు. ఆపదలపాలైనవాడు,తెలుసుకోగోరేవాడు,సంపదను కోరేవాడు,జ్ఞాని అను నాలుగు విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు నలుగురూ ఉత్తములే కాని జ్ఞాని ఎల్లపుడు నా యందే మనసు నిలుపుకొని సేవిస్తాడు కాబట్టి అతడు నాకు,అతడికి నేను చాలా ఇష్టులము మరియు అతడు శ్రేష్టుడు.

అనేకజన్మల పిదప "వాసుదేవుడే సమస్తము" అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు.

ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేస్తున్నాను.వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు.నన్ను సేవించినవారు నన్ను పొందుతారు.

నిర్వికారమూ,సర్వాతీతము ఐన నా స్వస్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు.యోగమాయచే కూడినవాడవడం చేత నన్ను వారు తెలుసుకోలేరు. భూత,భవిష్యత్,వర్తమాన కాలాలలోని సర్వజీవులూ నాకు తెలుసు.నేనెవ్వరికీ తెలియదు. రాగద్వేషాలచే కలిగిన సుఖదుఃఖాలచే జీవులు మోహించబడుచున్నారు.పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్నీ,పరబ్రహ్మనూ తెలుసుకుంటారు. భూతాధిపతిని,దైవాన్ని,యజ్ఞాధిపతిని ఐన నన్ను తెలుసుకొన్నవాళ్ళూ మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు.

అక్షరపరబ్రహ్మ యోగము

అక్షరపరబ్రహ్మ యోగము, భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

|| 8-1 ||
అర్జున ఉవాచ|
కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ|
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే

అర్జునుడిలా ఆడిగాడు: - పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది?ఆధ్యాత్మం ఏది?కర్మ అంటే ఏమిటి?అధి భూతమని దేనిని అంటారు?ఆది దైవతమని దేనిని అంటారు.

|| 8-2 ||
అధియజ్ఞః కథం కోऽత్ర దేహేస్మిన్మధుసూదన|
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నాడు?నిగ్రహ వంతులచేత మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.

|| 8-3 ||
శ్రీభగవానువాచ|
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: - పరమైనదీ బ్రహ్మము. ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అంటారు.

|| 8-4 ||
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్|
అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం ఆది భూతం. జీవుడు ఆధి దైవతం. జీవుళ్ళలో ఆధి యజ్ఞుణ్ణి నేనే.

|| 8-5 ||
అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః

అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళుతున్నారో, అతడు నాతత్వాన్నే పొందుతాడు. ఇందులో సందేహంలేదు

|| 8-6 |
యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్|
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|

కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.

|| 8-7 ||
తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన చిన నీవు నన్నే పొందుతావు. ఈ విషయంలో సందేహం లేదు.

|| 8-8 ||
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరుకుంటావు.

|| 8-9 ||
కవిం పురాణమనుశాసితార-
మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప-
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్

సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ, సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,

|| 8-10 ||
ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.

|| 8-11 ||
యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే

వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.

|| 8-12 ||
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ|
మూధ్న్యా|ర్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.

|| 8-13 ||
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్|
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని చేరుకుంటాడు.

|| 8-14 ||
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః|
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః

అర్జునా మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను సులభుణ్ణి.

|| 8-15 ||
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్|
నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.

|| 8-16 ||
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున|
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే (పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

|| 8-17 ||
సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః|
రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి తెలిసిన వారు.

|| 8-18 ||
అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే|
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమన బ్రహ్మము లోనే అంతా లీనమై పోతుంది.

|| 8-19 ||
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే|
రాత్ర్యాగమేऽవశః పార్థ ప్రభవత్యహరాగమే

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.

|| 8-20 ||
పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్యక్తాత్సనాతనః|
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.

|| 8-21 ||
అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ

ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన ఆ పరమాత్మ భావమేచేరవలసిన ఉత్తమ మార్గమని ౠషులు చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే, ఆ సర్వోత్తమ స్థానమే నేను.


|| 8-22 ||
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా|
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే లభిస్తాడు.

|| 8-23 ||
యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః|
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ

భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.

|| 8-24 ||
అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్|
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలుఅనే మార్గంలో బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.

|| 8-25 ||
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్|
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

|| 8-26 ||
శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని భావించబడుతున్నాయి. మొదటి దానివలన పునర్జమ కలగదు. రెండవ దాని వలన కలుగుతుంది.

|| 8-27 ||
నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన|
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున

పార్ధా ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి కా.

|| 8-28 ||
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్

వేదాలు, యజ్ఞాలు, తపస్సులుదానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు.

|| 8 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః


అర్జునుడు:
కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.

భగవానుడు:
నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.

మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.
కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.

వేదవేత్తలు,నిష్కాములు కోరుకునేదాన్ని క్లుప్తంగా చెప్తాను.నవద్వారాలను బంధించి,ఇంద్రియనిగ్రహం కల్గి,మనోవృత్తులను నిరోధించి,ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ,నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడు.ఇతర అలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడు తిరిగి ఈ దుఃఖపూరిత అశాశ్వత లోకంలో జన్మించక నన్నే పొందుతాడు.

బ్రహ్మలోకము వరకూ పునర్జన్మ ఉందికానీ నన్నుచేరినవారికి లేదు.బ్రహ్మకు వేయివేయియుగాలు ఒక పగలు,వేయియుగాలు ఒక రాత్రి.అతని పగటి కాలంలో పుట్టిన ప్రకృతి అతని రాత్రికాలంలో లయమవుతుంది.అలానే సకలజీవులు కూడా.ప్రకృతికి అతీతమైన,శాశ్వతమైన పరబ్రహ్మ మాత్రం నశించదు.అదే నా నివాస స్థానం.అది ఇంద్రియాలకు గోచరం కాదు.

సమస్తప్రాణులు ఉన్న,జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తసులభుడు.అగ్ని,జ్యోతి,పగలు,శుక్లపక్షం,ఉత్తరాయణ మార్గాలలో జన్మించినవారు పరబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు.పొగ,రాత్రి,కృష్ణపక్షం,దక్షిణాయనం లలో మరణించినవారు తిరిగి జన్మిస్తారు.ఇవి తెలిసిన యోగి భ్రాంతి చెందడు.కాబట్టి యోగయుక్తుడవై ఉండు.
దీనిని గ్రహించిన జ్ఞాని వేద,యజ్ఞ,జపతపాదుల వలన కలిగే పుణ్యస్థానాన్ని అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు.



రాజవిద్యారాజగుహ్య యోగము

అథ నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

|| 9-1 ||
శ్రీభగవానువాచ|
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేశుభాత్

దేనిని తెలుసుకోవడం వలన నీవు అశుభం(సంసారం)నుండి విముక్తుడవు అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ(బ్రహ్మ)జ్ఞానాన్ని అసూయా రహితుడవైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను.

|| 9-2 ||
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్|
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్

ఇది రాజవ్ద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం దీనిని సూటిగా అర్ధం చేసుకోవచ్చును. ధర్మ పరమైనది, అభ్యసించడం తేలిక, నిలకడగా ఉంటుంది.

|| 9-3 ||
అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప|
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని

అర్జునా ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషులు నన్ను పొంద లేక మృత్యు సంసార మార్గం లోనే తిరుగుతున్నారు.

|| 9-4 ||
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా|
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః

ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నాచేత వ్యాపించబడి ఉన్నది. జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు. అయితే నేను వాళ్ళలో లేను.

|| 9-5 ||
న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్|
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః

ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగమహిమని చూడు. భూత రాశిని పుట్టిస్తాను, భరిస్తాను కాని ఆభూతాలలో ఉండను.

|| 9-6 ||
యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్|
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ

సర్వత్రా సంచరించే ప్రచంఢ్ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఉంటుందో, అలాగే అన్ని ప్రాణులు నా లోనే ఉన్నాయని తెలుసుకో.

|| 9-7 ||
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

కుంతీ కుమారా! కల్పం పూర్తి అయినప్పుడు జీవులందరూ నా ప్రకృతిని పొందుతారు. కల్ప ప్రారంభంలో జీవులందరిని నేనే తిరిగి బయటికి వేస్తున్నాను.

|| 9-8 ||
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః|
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్

ప్రకృతి వశమైన ఈ యావత్తు నేను నా మాయను ధరించి తిరిగి తిరిగి సృజిస్తుంటాను.

|| 9-9 ||
న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ|
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు

ఓ ధనంజయా! ఆ కర్మలు నన్ను భంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనంగా ఉంటాను.

|| 9-10 ||
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్|
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే

నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది.

|| 9-11 ||
అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్|
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్

జీవరాశికి అధిపతివై ఉండీ మానవ శరీరాన్ని ఆశ్రయించిన(నా పరమ తత్వాన్ని గుర్తెరుగలేని మూఢులు)నన్ను నిర్లక్ష్యం చేస్తారు.

|| 9-12 ||
మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః|
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః

వారు వృధా ఆశలతో దండగమారి కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో, మతులు చెడి, భ్రాంతి గొలిపే అసురిక, రాకహస ప్రకృతిని ఆశ్రయించిన వారౌతారు.

|| 9-13 ||
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః|
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్

అర్జునా! మహాత్ములైతే దేవీ ప్రకృతిని, భూత రాశికి ఆది అయి నాశంలేని వాడిగా నన్ను తెలుసుక్ని అనన్య మనసుతో సేవిస్తారు.

|| 9-14 ||
సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః|
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే

వారు ఎప్పుడూ నన్ను కీర్తిస్తూ, దృఢమైన నిష్టతో సాధన చేస్తూ, భక్తితో నాకు నమస్కరిస్తూ నిత్య యుక్తులై ఉపాసిస్తారు.

|| 9-15 ||
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే|
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్

మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ (అద్వైత)భావంతో , వేరు అనే(ద్వైత)భావంతోనూ, విశ్వమంతటా ఉన్న నన్ను ఉపాశిస్తారు.

|| 9-16 ||
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్|
మన్త్రోऽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్

నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరుల కర్పించ బడే ఆహుతునినేను. హోమం చేసే మూలికలు నేను. మంత్రాన్ని నేను. అగ్నిని ఆహుతిని కూడా నేనే.

|| 9-17 ||
పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః|
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ

ఈ జగత్తుకి తండ్రి, తల్లి, కర్మఫల ప్రదాత, తెలియబడవలసినదీ, పవిత్రమైన ఓంకారమూ, ౠక్, సామ, యజుర్వేదాలు నేనే.

|| 9-18 ||
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్|
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్

నేను లక్ష్యమునూ, భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికి సాక్షినీ, సర్వానికి నివాస స్తానాన్ని, అందరికి శరణ్యామును, ఆప్తుడిని, నేనే నిధినీ అవయమైన మూలకారణమూ.

|| 9-19 ||
తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ|
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున

మూడు వేదాలనూ అధ్యనం చేసిన్స్వారు, సోమరసం త్రాగిన వారు. పాపాలను నిర్మూలించుకున్న పుణ్యాత్ములు నన్ను యజ్ఞాల ద్వారా పూజించి స్వర్గ వాసాన్ని కోరుకుంటారు. పుణ్య ఫలమైన ఇంద్ర లోకాన్ని పొంది, ఆ స్వర్గంలో దివ్య భోగాలను అనుభవిస్తారు.

|| 9-20 ||
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే|
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక-
మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్

(స్వర్గాన్ని కోరే)వారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవ లోకంలోకి ప్రవేసిస్తారు. ఇలా వేదాలలోని ఉత్తమ లోకాలన్నిచ్చే కరమ కాండను పట్టుకున్న కామదాసులు(జనన మరణాలను)పొందుతుంటారు.

|| 9-21 ||
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి|
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే

(స్వర్గాన్ని కోరే)వారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం ఖర్చు అయిపోగానే మానవ లోకానికి ప్రవేశిస్తారు. ఇలా వేదాలలోని ఉత్తమ లోకాలనిచ్చే కర్మకాండను పట్టుకొన్న కామదాసులు రాకపోకలను(జనన మరణాలను)పొందుతారు.

|| 9-22 ||
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే నష్ఠలిగి, ఏజనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో, వారి యోగకహేమాలను నేనే వహిస్తాను.

|| 9-23 ||
యేప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేऽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్

అర్జునా ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో ఆరాధిస్తుంటే, వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు

|| 9-24 ||
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ|
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే

నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించేవారు యదార్ధంగా నన్ను తెలుసుకోలేరు. అందువలన వాళ్ళు (మరలా జన్మలలో)దిగజారి పోతున్నారు.

|| 9-25 ||
యాన్తి దేవవ్రతా దేవాన్పితౄన్యాన్తి పితృవ్రతాః|
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోऽపి మామ్

దేవతలను ఆరాధించే వాళ్ళు దేతలను, పితరులను ఆరాధించే వాళ్ళు పితరులను, భూతాలను ఆరాధించేవాళ్ళు భూతాలనూ, నన్ను ఆరాధించే వాళ్ళు నన్నే చేరుకుంటారు.

|| 9-26 ||
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః

ఏవరు భక్తితో ఆకునో, పువ్వునో, ఫలాన్నో, నీటినో నాకు సమర్పిస్తారో ఆ శ్రద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను.

|| 9-27 ||
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్|
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్

అర్జునా నీవు ఏది తింటావో, ఏది చేస్తావో, ఏది హోమంచేస్తావో, ఏది దానం చేస్తావో, ఏది తపస్సు చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి.

|| 9-28 ||
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః|
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి

ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్న వాడై శుభాశుభ ఫాలాలు కలిసిన కర్మ భంధాల నుండి విడుదల పొంది, నీవు నన్ను చేౠకుంటావు.

|| 9-29 ||
సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోऽస్తి న ప్రియః|
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్

నేను ప్రాణులందరిలోను సమంగా ఉన్నాను. నాకు ద్వేషింప తగినవారు అంటూ లేరు, ప్రేమించవలసిన వారూ లేరు. అయితే నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు. నేను వాళ్ళల్లో ఉంటాను.

|| 9-30 ||
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్|
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః

ఎంత దుర్మార్గుడైనా అతడు అనన్య భావంతో సేవిస్తే అతడు సరైన నిర్ణయం తీసుకున్న వాడే, కాబట్టి సత్పురుషుడుగానే ఎంచతగిన వాడు.

|| 9-31 ||
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి

అర్జునా అతడు త్వరలోనే ధర్మాత్ముడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నాభక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి.

|| 9-32 ||
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేऽపి స్యుః పాపయోనయః|
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాన్తి పరాం గతిమ్

అర్జునా! నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాప యోనులు కానీ, స్త్రీలు, వైస్యులు, శూద్రులు కానీ వాళ్ళుకూడా ఉత్తమగతిని తప్పక పొందుతారు.

|| 9-33 ||
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా|
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్

ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పాడం దేనికి?కషణికము, దుఃఖమయమూ అయిన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.

|| 9-34 ||
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః

నీ మనస్సును నాకు అర్పించు. నా భక్తుడివి కా. నన్ను ఆరాధించు. నాకే నమస్కరించు. ఇలా నాలో మనసు నిలిపి, నన్ను లక్ష్యంగా పెట్టుకొని నన్నే చేరుతావు.

|| 9 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
కృష్ణుడు:
అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య రహస్యము,ఉత్తమం,ఫలప్రదం,ధర్మయుక్తం,సులభము,శాశ్వతం. దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు. నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను.ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి. ప్రళయకాలంలో అన్ని ప్రాణులూ నా మాయలోనే లయమవుతాయి,సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను. అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు. నా సంకల్పం చేతనే నా మాయ సృష్టి కార్యం చూస్తోంది. నా తత్వం తెలియని వాళ్ళూ నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు. అలాటివాళ్ళూ వ్యర్థ కర్మలతో,దురాశలతో అజ్ఞానంచే రాక్షసభావాలకు గురి అవుతున్నారు. మహాత్ములు నా తత్వం తెలుసుకొని నిశ్చలభక్తి తో నన్ను సేవిస్తున్నారు. కొందరు జ్ఞానయోగులు ద్వైత,అద్వైత పద్దతులలో నన్ను ఉపాసిస్తున్నారు. యజ్ఞమూ,దానికి ఉపయోగపడు పదార్థాలూ,ఫలితము,అగ్ని అన్నీ నేనే. తల్లి,తండ్రి,తాత,తెలుసుకోదగినవాడు,వేదాలు,ఓంకారము అన్నీ నేనే. ఆశ్రయము,ప్రభువు,సాక్షి,ఆధారము,హితుడు,కారణము నేనే. కరువు,సస్యశ్యామలం,మృత్యువు,అమృతం,సత్,అసత్ అన్నీ నేనే. స్వర్గం పొందాలనే కోరికతో కర్మలు చేసేవాళ్ళూ అది పొంది భోగాలు అనుభవించి పుణ్యఫలం క్షీణించగానే మళ్ళీ భూలోకంలో పుడతారు. నిరంతరము నా ధ్యాసలోనే ఉంటూ,నన్నే ఉపాసించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. శ్రద్దాభక్తులతో ఇతర దేవతలను పూజించేవారు కూడా నన్ను పూజించేవారే అగుచున్నారు.కాని అది చుట్టుమార్గం. వారు నా స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వలన పునర్జన్మలు పొందుతున్నారు. దేవతలను పూజించేవారు దేవలోకాన్ని,పితరులను పూజించేవారు పితృలోకాన్ని,భూతాలను పూజించేవారు భూతలోకాన్ని పొందుతారు.నన్ను సేవించేవాళ్ళు నన్నే పొందుతారు. భక్తితో సమర్పించే ఆకు కానీ,పువ్వు కానీ,పండు కాని ,నీళ్ళైనా కాని నేను ప్రేమతో స్వీకరిస్తాను. నువ్వు చేయు పని,భోజనం,హోమం,దానం,తపం అన్నీ నాకూ సమర్పించు.అప్పుడు కర్మల నుండి విముక్తుడవై నన్ను పొందుతావు. ఇష్టము,అయిష్టము అన్న భేదం నాకు లేదు.అంతా సమానమే.నాను భజించువారిలో నేను,నాలో వారు ఉంటాము. స్థిరభక్తితో సేవించువారు ఎంత దురాచారులైనా వారు సాధువులే.అలాంటివారు తొందరగానే పరమశాంతి పొందుతారు.నా భక్తుడు ఎన్నడూ చెడిపోడని ప్రతిజ్ఞ గా చెప్పవచ్చు. పాపులైనా కానీ,స్త్రీ,వైశ్య,శూద్రులైనా కాని నన్ను ఆశ్రయిస్తే నిశ్చయంగా మోక్షం పొందుతారు. నాయందు మనసు నిల్పి,నా భక్తుడవై,నన్నే సేవించు.నన్నే నమ్మి,నాకే నమస్కరిస్తూ,నాయందే దృష్టి నిలిపితే నన్ను పొందితీరుతావు.





విభూతి యోగము

విభూతి యోగము, భగవద్గీతలో పదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ దశమోధ్యాయః - విభూతియోగః
|| 10-1 ||
శ్రీభగవానువాచ|
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః|
యత్తేऽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా

శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు:- ఓమహానుభావా! అర్జునా! నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని, నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను.

|| 10-2 ||
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః|
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

నా పుట్టుకను గురించి దేవతలుకాని మహర్షులుకాని ఎరుగరు. దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను.

|| 10-3 ||
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్|
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే

పుట్టుకా మొదలులేని వాడుగానూ, లోకాల్కు ప్రభువుగాను నన్ను తెలుసుకున్న వాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని పాపాలనుండి విముక్తి చెందుతాడు.

|| 10-4 ||
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః|
సుఖం దుఃఖం భవోऽభావో భయం చాభయమేవ చ

తెలివి, జ్ఞానం, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడమూ, లేకపోవడమూ, భయాభయాలు (నా వలననే కలుగుతాయి)

|| 10-5 ||
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశః|
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః

అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు మొదలైన వేరు వేరు భావాలు జీవుళ్ళలో నా వలననే కలుగుతాయి.

|| 10-6 ||
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః

శృష్టి ఆరంభంలో ఉన్న సప్తౠషులు, నలుగురు మనువులు నా సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చారు.

|| 10-7 ||
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః|
సోవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః

ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు, చలించని యోగంలో నిలిచి పోతాడు. ఇందులో సందేహము లేదు.

|| 10-8 ||
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే|
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః

నేను అన్నిటి పుట్టుకకి హేతువుని నా వలననే సమస్తమూ నడుస్తుందని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవిస్తారు.

|| 10-9 ||
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ

తమ మనసులను నాలో లీనము చేసి జీవితాలను నాకే అర్పించి, నన్ను గురించే పరస్పరమూ బోధించుకుంటూ, చెప్పుకుంటూ నిత్యమూ తృప్తి పడతారు, ఆనందిస్తారు.

|| 10-10 ||
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్|
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే

అలాసతతమూ మనసు నాయందుంచి, ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానయోగాన్ని నేను కలుగచేస్తాను.

|| 10-11 ||
తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమః|
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా

వారిని కనికరించడం కోసమే నేను వారి మనస్సులలో నిలిచి, వారి అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపంతో నశింపజేస్తాను.

|| 10-12 ||
అర్జున ఉవాచ|
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్|
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్

అర్జునుడు ఇలా అన్నాడు:- నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి ఆది దేవుడివి. , పుట్టుక లేనివాడివి.

|| 10-13 ||
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా|
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే

అని అందరూ ౠషులు, దేవర్షి నారదుడూ, అలాగే అశితుడూ, దేవలుడూ, వ్యాసుడూ అంటారు. స్వయంగా నీవుకూడా అలాగే చెబుతున్నావు.

| 10-14 ||
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ|
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః|

కేశవా! నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వశిస్తున్నాను నీవ్యక్త శరీరాన్ని దేవతలుకాని దానవులు కాని ఎరుగరు.

|| 10-15 ||
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ|
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే

భూత భావనుడా! భూతేశా! జగత్పతీ! పురుషోత్తమా! నిన్ను నీవే నీచేతనే స్వయంగా ఎరుగుదువు.

|| 10-16 ||
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః|
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి

ఏయేవిభూతులలో నీవు ఈలోకమంతటా వ్యాపించి వున్నావో ఆదివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి.

|| 10-17 ||
కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్|
కేషు కేషు చ భావేషు చిన్త్యోసి భగవన్మయా

ఓయోగీ! సదాధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?భగవంతుడా ఏయేరూపాలతో నిన్ను ధ్యానించవచ్చు?

|| 10-18 ||
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన|
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్

ఓజనార్ధనా! నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృతతుల్యమైన నీమాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు.

|| 10-19 ||
శ్రీభగవానువాచ|
హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే

శ్రీ భగవానుడన్నాడు:అర్జునా! నా దివ్య విభూతులలో ముక్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను. నా విస్తారానికి అంతు అంటూ లేదు.

|| 10-20 ||
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ

గుడాకేశా! నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల అది మధ్యంతాలు(సృష్టి స్థితి లయాలు)నేనే.

|| 10-21 ||
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ

నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాళ్ళలో కిరనాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో మరీచినీ, నక్షత్రాలలో చంద్రుడిని.

|| 10-22 ||
వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా

నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలళో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని.

|| 10-23 ||
రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్|
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్

నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో పావకుడిని, పర్వతాలలో మేరువుని.

|| 10-24 |
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్|
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః|

అర్జునా! నేను పురోహితులలో శ్రేష్టుడైన బ్రుహస్పతిని. సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని అని తెలుసుకో.

|| 10-25 |
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్|
యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః|

మహర్షులలో భ్రుగువుని, శబ్దాలలో ఏకాకషరమైన ఓంకారాన్ని. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని.

|| 10-26 ||
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః|
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః

నేను వృక్షాలలో రావి చెట్టుని. దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో చిత్రరధుణ్ణి, సిద్ధులలో కపిల మునిని.

|| 10-27 |
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్|
ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్|

నేను గుర్రాలలో అమౄతంతో పుట్టిన ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఇరావతాన్ని, మనుష్యులలో రాజుని.

|| 10-28 ||
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మనమధుడిని, సర్పాలలో వాసుకిని.

|| 10-29 ||
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వ్రుణూడిని, పీరులలో ఆర్యముడిని, సమ్యమవంతులలో నిగ్రహాన్ని.

|| 10-30 ||
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోऽహం వైనతేయశ్చ పక్షిణామ్

నేను దైత్యులలో ప్రహ్లాదుడీని, లెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్ని, మృగాలలో మృగేంద్రుడిని, పక్షులలో గరుత్మంతుడిని.

|| 10-31 ||
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్|
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ

నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని శస్త్రధారులలో రాముడిని, జలచరాలలో ముసలిని, నదులలో గంగని.

|| 10-32 ||
సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున|
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్

అర్జునా! సృష్టులన్నిట్లో ఆదిమధ్యాంతాలు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వాదించేవాళ్ళల్లో వాదాన్ని నేనే.

|| 10-33 |
అక్షరాణామకారోऽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ|
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః|

నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనంలేని కాలాన్ని. సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని.

|| 10-34 |
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్|
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా|

నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఊదయించబోయే వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా గుణాలు కూడానేనే.

|| 10-35 ||
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్|
మాసానాం మార్గశీర్షోహమృతూనాం కుసుమాకరః

అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, చందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని.

|| 10-36 ||
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్|
జయోస్మి వ్యవసాయోస్మి సత్త్వం సత్త్వవతామహమ్

నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని.

|| 10-37 ||
వృష్ణీనాం వాసుదేవోऽస్మి పాణ్డవానాం ధనఞ్జయః|
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః

నేను వృష్టి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో, అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని.

|| 10-38 ||
దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్|
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్

శాసకులలో దండమూ, జయంకోరేవాళ్ళల్లోని నీతీ, రహస్యాలలో మౌనమూ, జ్ఞానులలో జ్ఞానమూ నేనే.

|| 10-39 ||
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున|
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్

అర్జునా! అన్ని ప్రాణుల యొక్క మూలకారణం నేను. చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు.

|| 10-40 ||
నాన్తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప|
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా

అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను.

|| 10-41 ||
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్

విశిష్టమైన గుణమూ, శోభా, శక్తీ కలిగినది ఏది ఊణ్ణాదో ఆప్రతిదీ నా తేజము నుండి పుట్టినదని తెలుసుకో.

|| 10-42 ||
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున|
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్

అర్జునా ఇన్ని మాటలు దేనికి ఈ యావత్ప్రపంచాన్ని నేను ఒక్క అంశతో భరించి నిలిచి ఉన్నాను.

|| 10 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమోऽధ్యాయః


ఆధ్యాయ సంగ్రహం:
కృష్ణుడు:
నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను. నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు.ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం.నాకు మొదలుచివరా లేవు.సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు. అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి. సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు. నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు. నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు. నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను.

అర్జునుడు:
నువ్వు శాశ్వతుడని,పరమాత్ముడనీ,ఆది అనీ ఋషులు,వ్యాసుడు అందరూ,నువ్వూ అంటున్నారు.నేనూ నమ్ముతున్నాను.నిన్ను నువ్వుతప్ప ఇతరులు తెలుసుకోలేరు.ఏఏ వస్తువులందు ఏ విధంగా నిన్ను ధ్యానిస్తే నిన్ను తెలుసుకోగలవో చెప్పు.వివరంగా చెప్పు.

కృష్ణుడు:
నా విభూతులు అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు.ఎందుకంటే అవి అనంతం.కొన్ని ముఖ్యమైనవి చెప్తాను విను. అన్ని ప్రాణుల ఆత్మను,సృష్టిస్థితిలయాలు,ఆదిత్యులలో విష్ణువును,జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను,మరుత్తులలో మరీచి,చంద్రుడను,వేదాలలో సామవేదం,దేవతలలో ఇంద్రుడను,ఇంద్రియాలలో మనసును,ప్రాణుల చైతన్యశక్తిని,రుద్రులలో శంకరుడు,యక్షరాక్షసులలో కుబేరుడను,వసువులలో పావకుడు,పర్వత శిఖరాలలో మేరువు,పురోహితులలో బృహస్పతి,సేనాధిపతులలో కుమారస్వామిని,సరస్సులలో సముద్రాన్ని,మహర్షులలో భృగువు,వ్యాకరణంలో ఒంకారం,యజ్ఞాలలో జపయజ్ఞం,స్థావరాలలో హిమాలయం,వృక్షాలలో రావి,దేవర్షులలో నారదుడు,గంధర్వులలో చిత్రరథుడు,సిద్దులలో కపిలుడు,గుఱ్ఱాలలో ఉచ్చైశ్శ్రవం,ఏనుగులలో ఐరావతం,మానవులలో మహారాజు,ఆయుధాలలో వజ్రాయుధం,గోవులలో కామధేనువు,ఉత్పత్తి కారకులలో మన్మథుడు,పాములలో వాసుకి నేనే.

నాగులలో అనంతుడు,జలదేవతలలో వరుణుడు,పితృదేవతలలో ఆర్యముడు,శాసకులలో యముడు,రాక్షసులలో ప్రహ్లాదుడు,కాలం,మృగాలలో సింహం,పక్షులలో గరుత్మంతుడు,వేగము కల వాటిలో వాయువు,శస్త్రధారులలో శ్రీరాముడు,జలచరాలలో మొసలి,నదులలో గంగానది,సృష్టికి ఆదిమధ్యాంతాలు నేనే.వాదాలు కూడా నేనే. అక్షరాలలో అకారాన్ని,సమాసాలలో ద్వంద్వసమాసం,సర్వకర్మ ఫలప్రదాత,మ్రుత్యువూ,సృజనా,స్త్రీ శక్తులలో కీర్తీ,లక్ష్మిని,వాక్కును,స్మృతీ,మేధ,ధృతి,క్షమ నేనే. సామములలో బృహత్సామం,ఛందస్సులలో గాయత్రి,నెలలలో మార్గశిరము,ఋతువులలో వసంతమూ నేనే. వంచనలలో జూదాన్ని,తేజోవంతులలో తేజం,విజయం,కృషి చేయువారి ప్రయత్నం,సాత్వికుల సత్వగుణం,యాదవులలో వాసుదేవుడను,పాండవులలో అర్జునుడను,మునులలో వ్యాసుడు,కవులలో శుక్రుడను నేనే. దండించేవారి దండనీతి,జయించేవారి రాజనీతి,రహస్యాలలో మౌనం,జ్ఞానులలో జ్ఞానం నేనే. సర్వభూతాలకు బీజకారణం నేనే.నేను కానిది ఏదీ లేదు. నా విభూతులు అనంతం.కాబట్టి సంగ్రహంగా చెప్పాను. ఐశ్వర్యంతోను,కాంతితోను,ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో. ఇన్ని మాటలు దేనికి? నా తేజస్సులోని ఒకేఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు.




విశ్వరూపసందర్శన యోగము

విశ్వరూప సందర్శన యోగము, భగవద్గీతలో పదకొండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథైకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః

|| 11-1 ||
అర్జున ఉవాచ|
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|
యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ

అర్జునుడిట్లనియె: నన్ను అనుగ్రహించుటకై కరుణతో నీచేత చెప్పబడిన పరమ రహస్యమైన అధ్యాత్మఙ్ఞానముచే నా అఙ్ఞాన మోహమంతా మాయమైపోయినది.

|| 11-2 ||
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా|
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్

హే కృష్ణా! సర్వభూతముల సృష్టి, స్థితి, లయ రహస్యమును గూర్చి నీ శాశ్వతమయిన అవ్యయమైన మహా మహిమను గూర్చి నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని.

|| 11-3 ||
ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర|
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ

ఓ పరమేశ్వరా! నీ మహాద్భుత విశ్వరూప మహిమను గూర్చి నీవు చెప్పినదంతయు పరమ సత్యమే. ఓ పురుషోత్తమా! అపార ఙ్ఞాన శక్తి తేజములతో కూడిన మహా ఘనమైన నీ అనంత ఐశ్వర్య రూపమును ప్రత్యక్షముగ దర్శించగోరుచున్నాను.

|| 11-4 ||
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో|
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్

హే యోగేశ్వర ప్రభో! నీ ఘన విశ్వరూపం నాచేత చూడశక్యమైనదని నీవు తలంచుచో అట్టి నాశరహితమైన నీ దివ్య రూపమును నాకు చూపుము.

|| 11-5 ||
శ్రీభగవానువాచ|
పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః|
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ

ఓ పార్థా! అసంఖ్యాకములైన, అనేక విధములుగనున్న, అనేక వర్ణములు కలిగిన, అనేకాకృతులలోనున్న నా దివ్య రూపమును చూడుము.

|| 11-6 ||
పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా|
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత

ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ దేవతలను, సప్త మరుత్తులను నాలో చూడుము. మరియు మహాశ్చర్యమును కలిగించే పూర్వమెప్పుడూ ఎవ్వని చేత చూడబడని అనేక అద్భుతములను నాలో నిపుడుగాంచుము.

|| 11-7 ||
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్|
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి

ఓ అర్జునా! నాదేహమందే చరాచర ప్రపంచమునెల్లను ఒకే చోటనున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్ల నాలోనే చూడుము.

|| 11-8 ||
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా|
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్

నీ స్థూల దృష్టితో నా అనంత స్వరూప మహిమను చూడలేవు. కనుక దివ్యదృష్టి నీకిచ్చుచున్నాను. ఈ ఙ్ఞాన దృష్టితో అపారమైన నా విశ్వరూప వైభవమును గాంచుము.

|| 11-9 ||
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః|
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్

సంజయుడిట్లనియెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహా యోగీశ్వరుడైన భగవానుడిట్లు చెప్పిన పిమ్మట సర్వోత్తమమైన ఐశ్వర్యరూపమైన తన మహిమాన్విత విశ్వరూపమును పార్థునకు చూపెను.

|| 11-10 ||
అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్|
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్

అనేక వక్త్రములతో, అనేక నేత్రములతో, అనేక అద్భుత దర్శనములతో, అనేక దివ్యాభరణములతో, దివ్యాయుధములతో భగవానుని ఘన దివ్యరూపము శోభిల్లుచుండెను.

|| 11-11 ||
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్

దివ్యములైన పుష్పమాలికలను, దివ్యములైన వస్త్రములను ధరించి, దివ్య సుగంధ చందనాదుల పూతలతో నిండి, పరమాశ్చర్యకరమై, మహాకాంతివంతమై, అనంతమై, విశ్వతోముఖమై భగవానుని అద్భుత విశ్వరూపము విలసిల్లుచుండెను.

|| 11-12 ||
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా|
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః

ఆకాశమున ఒక్కతూరి హఠాత్తుగా సహస్ర సూర్యులు ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతిసలుగునో అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.

|| 11-13 ||
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా

అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును ఒకేచోటనున్న దానినిగా చూచెను.

|| 11-14 ||
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః|
ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత

పిమ్మట ధనంజయుడు విస్మయముతో పులకాంకితదేహుడై భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసి అంజలి బద్ధుడై ఇట్లనెను.

|| 11-15 ||
అర్జున ఉవాచ|
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్

అర్జునుడు పలికెను: ఓ దేవాదిదేవా! నీ విరాట్-రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.

|| 11-16 ||
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను.

|| 11-17 ||
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్

హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.

|| 11-18 ||
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే

పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలుసుకొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. అని నా విశ్వాసము.


|| 11-19 ||
అనాదిమధ్యాన్తమనన్తవీర్య-
మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్

నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.

|| 11-20 ||
ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్

ఓ మహాత్మా! దివినుండి భువివఱకుగల అంతరిక్షమునందతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అధ్బుతమైన నీ భయంకరరూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి.

|| 11-21 ||
అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి|
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసఙ్ఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః

ఇదిగో, ఆదేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిధ్దులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.

|| 11-22 ||
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|
గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్దసముదాయములును నిన్నే దర్శించుచున్నారు.

|| 11-23 ||
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్|
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్

ఓ మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమునుచూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణికిపోవుచున్నాను.

|| 11-24 ||
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో

ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అదే అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా దైర్యము సడలినది. శాంతి దూరమైనది.

|| 11-25 ||
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని|
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస

ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో (భయంకరమైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-26 ||
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః

ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతోసహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును.

|| 11-27 ||
వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని|
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మద్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.


|| 11-28 ||
యథా నదీనాం బహవోమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి|
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి

అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు.


|| 11-29 ||
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః|
తథైవ నాశాయ విశన్తి లోకాస్-
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః

మిడుతలన్నియు మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు.

|| 11-30 ||
లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-
లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో

హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపులనుంచి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.

|| 11-31 ||
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోస్తు తే దేవవర ప్రసీద|
విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను.

|| 11-32 ||
శ్రీభగవానువాచ|
కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః

శ్రీ భగవానుడు పలికెను : నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు (మిగిలియుండరు).

|| 11-33 ||
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్

కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

|| 11-34 ||
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ) కర్ణాది యుద్దవీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్దము చేయుము.

|| 11-35 ||
సఞ్జయ ఉవాచ|
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ|
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య

సంజయుడు పలికెను: ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మయొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను. మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.

|| 11-36 ||
అర్జున ఉవాచ|
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః

అర్జునుడు పలికెను: ఓ అంతర్యామి! కేశవా! నీనామగుణప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్దగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు.

|| 11-37 ||
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే|
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్

ఓమహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు - కనుక వారు (సిద్దాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్-అసత్లు నీవే. వాటికంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానందఘనపరబ్రహ్మవు నీవే.

|| 11-38 ||
త్వమాదిదేవః పురుషః పురాణస్-
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప

ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది.

|| 11-39 ||
వాయుర్యమోగ్నిర్వరుణః శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|
నమో నమస్తేऽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోऽపి నమో నమస్తే

నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు.

|| 11-40 ||
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోऽస్తు తే సర్వత ఏవ సర్వ|
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోऽసి సర్వః

అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే.

|| 11-41 ||
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి

నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరబాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని.

|| 11-42 ||
యచ్చావహాసార్థమసత్కృతోసి
విహారశయ్యాసనభోజనేషు|
ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం
తత్క్షామయే త్వామహమప్రమేయమ్

ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమునగాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములనన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను.

|| 11-43 ||
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్|
న త్వత్సమోऽస్త్యభ్యధికః కుతోన్యో
లోకత్రయేऽప్యప్రతిమప్రభావ

ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును?

|| 11-44 ||
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్|
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్

కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్ధించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును, నా అపరాధములను నీవు క్షమింపుము.


|| 11-45 ||
అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస

మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశా! జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-46 ||
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే

కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము.

|| 11-47 ||
శ్రీభగవానువాచ|
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్|
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్-రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మఱి యెవ్వరును చూచియుండలేదు.

|| 11-48 ||
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్-
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర

ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని, తదితరపుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకుదప్ప మఱియెవ్వరికిని చూడశక్యముగాదు.

|| 11-49 |
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్|
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య

ఈ విధమైన ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును,మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము.

|| 11-50 ||
సఞ్జయ ఉవాచ|
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః|
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా

సంజయుడు పలికెను: వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను.

|| 11-51 ||
అర్జున ఉవాచ|
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన|
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః

అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! మీ అతిసౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందరరూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక (సహజ)స్థితిని పొందితిని.

|| 11-52 ||
శ్రీభగవానువాచ|
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః

శ్రీ భగవానుడు పలికెను: నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలుసైతము ఈ రూపమును దర్శించుటకు సదా ఉవ్విళ్ళూరుచుందురు.

|| 11-53 ||
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా|
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా

నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేదపఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని శక్యము కాదు.

|| 11-54 ||
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప

ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్య భక్తిద్వారా మాత్రమే సాధ్యమగును.

|| 11-55 ||
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సఙ్గవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాణ్డవ

అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేనివాడును, ఏప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు.

|| 11 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపదర్శనయోగో నామైకాదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు: దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది. నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు. నీ విస్వరూపం చూడాలని ఉంది. నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.

శ్రీకృష్ణుడు:
అనేక విధాలైన, వర్ణాలు కలిగిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు. సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను. చూడు.

సంజయుడు:
ధృతరాష్ట్ర రాజా! అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా, వేయి సూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు. ఆశ్చర్య, ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు. అప్పుడు

అర్జునుడు:
హే మాహాదేవా! దివ్యమైన, ఆదీ అంతము లేని నీలో సమస్త దేవతలను, భూతగణాలను, పద్మాసనుడైన బ్రహ్మను, మహర్షులను అందరినీ చూస్తున్నాను. అన్ని వైపులా చేతులతో, ముఖాలతో, కన్నులతో ఉన్న నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను. అసంఖ్యాక కిరీటాలు, గదలు, చక్రాలు ధరించి సూర్యాగ్నుల తేజస్సుతో నీ రూపాన్ని చూస్తున్నాను. తెలుసుకోవలసిన పరమాత్మవు, ప్రపంచానికి ఆధారము, శాశ్వతుడవు, ధర్మరక్షకుడవు, పరబ్రహ్మంవు నువ్వే అని నిశ్చయించుకున్నాను. ఆధిమధ్యాంతరహితము, అపరిమిత శక్తి యుతము, అనంత బాహువులతో సూర్యచంద్రులే కన్నులుగా ప్రజ్వలితాగ్నిలా గల ముఖకాంతి గలది, తన తేజస్సుతో సమస్త విశ్వాన్ని తపింపచేస్తున్న నీ రూపాన్ని అర్థం చేసుకుంటున్నాను. సూదిమొన సందు లేని నీ మహోగ్రరూపం చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి. సమస్తదేవతా స్వరూపాలు నీలో ప్రవేశిస్తున్నాయి. ఋషులు, సిద్దులు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. అన్నిలోకాల వాసులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నాయి. నీ భయంకర విశ్వరూపాన్ని చూసి అన్ని లోకాలు, నేను భయపడుతున్నాము. నీ విశాల భయంకర నేత్రాలు జ్వలిస్తున్నాయి. నిన్ను చూస్తున్నకొద్ది నా మనసు చలించి ధైర్యం నశించిపోతోంది. నాకు శాంతి లేదు. కాలాగ్నిలా ఉన్న నిన్ను చూసి నేను భయపడిపోతున్నాను. నన్ను కరుణించు. అనేకమంది రాజులు, కౌరవులు, భీష్మద్రోణులు, కర్ణుడు నా యోధులు కూడా నీ భయంకర ముఖం లోనికి వెళ్తున్నారు. వారిలో కొందరు నీ కోరల మధ్య నలిగి చూర్ణమై పోతున్నారు. నదులు సముద్రంలో కలుస్తున్నట్లు రాజలోకమంతా నీ భయంకర ముఖాగ్ని లోనికి పొర్లుతోంది. అన్ని లోకాలు నీ ముఖంలోనికి పడి నాశనమవుతున్నాయి. నీవు అంతా మింగి వేస్తున్నావు. జగత్తు భయపడుతోంది. ఇంత భయంకరమైన నీవెవరవు? తెలియజెయ్యి. శ్రీకృష్ణుడు: సర్వస్వం లయం చేసే కాల స్వరూపుడిని నేను. ప్రస్తుతం నా పని సంహారం. నీవు యుద్ధం మానినా సరే నీవు, కొందరు తప్ప ఇక్కడ ఎవరూ మిగలరు. లే! యుద్ధానికి సిద్దపడు. శతృసంహారం చేసి భూమండలాన్ని అనుభవించు. నిమిత్తమాతృడవై యుద్ధం చేయి. ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదులు అందరినీ ముందే చంపివేశాను. నాచే చంపబడిన వారినే నువ్వు చంపబోతున్నావు. యుద్ధం చెయ్యి. జయిస్తావు.

అర్జునుడు:
నీ కీర్తన చేత జగం ఆనందిస్తోంది, రాక్షసులు భయంచే దిక్కు తోచక పరుగెడుతున్నారు. సిద్దులు నీకు మ్రొక్కుతున్నారు. సత్తుకు, అసత్తుకు, బ్రహ్మకు మూలపురుషుడైన నిన్ను నమస్కరించని వారెవరు ఉంటారు? ఆదిదేవుడవు, సనాతనుడవు, అంతా తెలిసిన వాడవు, సర్వ జగద్వ్యాపివి. బ్రహ్మ కన్నతండ్రివి, అగ్ని, వరుణుడు అన్నీ నీవే. నీకు నా పునఃపునః నమస్కారాలు. నిన్ను అన్నివైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీ మహిమను గుర్తించలేక చనువుతో కృష్ణా, సఖా, యాదవా అంటూ నిన్ను పిలిచాను. సరసాలాడాను. క్షమించు. నీకు సమానుడైన వాడే లేనప్పుడు నీ కన్నా అధికుడెలా ఉంటాడు? తండ్రి కొడుకుని, ప్రియుడు ప్రియురాలిని, మిత్రుడు మిత్రుని తప్పులు మన్నించినట్లు నన్ను మన్నించు. నీ ఈ రూపం చూసి భయం కల్గుతోంది. నీ శంఖ, చక్ర, కిరీట, గదా పూర్వకమైన మునుపటి రూపంలోనికి రా.

కృష్ణుడు:
నీ మీది కరుణతో నా తేజ విశ్వరూపాన్ని చూపించాను. నీవొక్కడు తప్ప పూర్వం ఈ రూపాన్ని ఎవరూ చూడలేదు. వేదాలు చదివినా, దానధర్మాలు, జపాలు, కర్మలు చేసినా ఎవరూ చూడలేకపోయారు. నీవు భయపడవద్దు. నా పూర్వరూపమే చూడు అంటూ సాధారణ రూపం చూపించాడు.

అర్జునుడు: ఇప్పుడు నా మనసు కుదుటపడింది.

కృష్ణుడు:
దేవతలు కూడా చూడాలని తపించే ఈ రూపదర్శనం తేలిక కాదు. వేదాలు చదివినా, దానాలు, పూజలు, తపస్సు చేసినా ఈ రూప దర్శనం కలుగదు. అనన్యభక్తితో మాత్రమే సాధ్యం అవుతుంది. నా కొరకే కర్మలు చేస్తూ, నన్నే నమ్మి, నా యందు భక్తి కల్గి విశ్వంలో నిస్సంగుడైనవాడు మాత్రమే నన్ను పొందగలడు.



భక్తి యోగము

భక్తి యోగము, భగవద్గీతలో పన్నెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.


అథ ద్వాదశోధ్యాయః - భక్తియోగః

|| 12-1 ||
అర్జున ఉవాచ|
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే|
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?

|| 12-2 ||
శ్రీభగవానువాచ|
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః

శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)

|| 12-3 ||
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే|
సర్వత్రగమచిన్త్యఞ్చ కూటస్థమచలన్ధ్రువమ్

కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, సకల భూతములకును హితమునే కోరుచుండువారును, సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.

|| 12-4 ||
సన్నియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః|
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః

అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.

|| 12-5 ||
క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్||
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే

నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.

|| 12-6 ||
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరః|
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే

సర్వకర్మలన్నీనాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకుని మనస్సుని అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,

|| 12-7 ||
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్|
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్

అర్జునా నాలో మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.

|| 12-8 ||
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః

నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.

|| 12-9 ||
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ

ధనంజయా స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.

|| 12-10 ||
అభ్యాసేప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.

|| 12-11 ||
అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీ కోసం ఛెసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.

|| 12-12 ||
శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే|
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్

అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.

|| 12-13 ||
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ|
నిర్మమో నిరహఙ్కారః సమదుఃఖసుఖః క్షమీ

ఏ ప్రాణాన్ని ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, సుఖదుహ్కాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,

|| 12-14 ||

సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః

నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-15 ||
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః

ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో, సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు.

|| 12-16 ||
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః

అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-17 ||
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి|
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః

ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో సుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-18 ||
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః

శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు)

|| 12-19 ||
తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః

నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.

|| 12-20 ||
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే|
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేऽతీవ మే ప్రియాః

ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.

|| 12 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?

కృష్ణుడు:
నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కలిగిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు. సంతోషం,దుఃఖం,ద్వేషం,శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు. శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు. పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు.





క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము, భగవద్గీతలో పదమూడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథ త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

|| 13-1 ||
అర్జున ఉవాచ|
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ|
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ

అర్జునుడిట్లనియెను: హే కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి తెలియగోరుచున్నాను.

|| 13-2 ||
శ్రీభగవానువాచ|
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః

శ్రీ భగవానుడిట్లనియెను: ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము నెవడెరుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.

|| 13-3 ||
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత|
క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్జ్ఞానం మతం మమ

మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన జీవుని నన్నుగా ఎరుగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా మతము.

|| 13-4 ||
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్|
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు

ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన బుట్టినదో, ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని సంగ్రహముగా నాద్వారా వినుము.

|| 13-5 ||
ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్|
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః

ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధాలుగా వివరింపబడినది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది పలు విధములుగా విభజించి నిరూపించబడినది. బ్రహ్మసూత్ర పదాలు దీనిని గురించి హేతు బద్ధంగా నిశ్చయించి చెప్పాయి.

|| 13-6 ||
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ|
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః

మహాభూతాలు(ఐదు)అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి), ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ(మొత్తం 24క్షేత్రాలు)

|| 13-7 ||
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః|
ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్

ఇచ్చ, ద్వేషం, సుఖఅం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల ఇవి వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైంది.

|| 13-8 ||
అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్|
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః

తనని తాను పొగడక పోవడం, ఢంభము లేకుండా ఉండడమూ, అహింసా, ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, ఆత్మనిగ్రహమూ.

|| 13-9 ||
ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ|
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్

ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో, దుఃఖాన్ని, దోషాన్ని నిత్యమూ చూడటమూ,

|| 13-10 ||
అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు|
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు

ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితోతాధాత్మ్యము చెందక పోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానిది ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,

|| 13-11 ||
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ|
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది

ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో గడపడమూ, జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,

|| 13-12 ||
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా

నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనది అంతా అజ్ఞానము.

|| 13-13 ||
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వామృతమశ్నుతే|
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే

దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది.

|| 13-14 ||
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్|
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి

దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి, అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.

|| 13-15 ||
సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్|
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ

అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా కూడా గుణాలను భోగించేది.

|| 13-16 ||
బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ|
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్

అది(జ్ఞేయము)జీవుళ్ళకు బయటా, లోపలా ఉండేది, కదిలేది కదలనిది కూడా ఐనా, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు. (అవిద్వాంసులకు)దూరంగానూ, విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.

|| 13-17 ||
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్|
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ

ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవుళ్ళలో విభజింపబడి నట్లుగానూ, జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి.

|| 13-18 ||
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే|
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్

వెలుగలకు వెలుగది. (అజ్ఞానమనే)చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది.

|| 13-19 ||
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః|
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే

క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందుతాడు.

|| 13-20 ||
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి|
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్

ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో.

|| 13-21 ||
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే

కార్యకార్యాల తయారీకి ప్రకృతి కారణము అని చెప్పబడుతుంది. సుఖదుఃఖాల అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడతాడు.

|| 13-22 ||
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు

ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచీ, చెడు జన్మలెత్తడానికి కారణము.

|| 13-23 ||
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః

ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ చెప్పబడుతున్నాడు.

|| 13-24 ||
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే

పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణీ, గుణాలతో సహా ప్రకృతినీ ఎవరు తెలుసుకుంటారో, అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు.

|| 13-25 |
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే|

కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను ఆత్మను చూస్తారు.

|| 13-26 ||
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః

ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.

|| 13-27 ||
యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ

భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

|| 13-28 ||
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి

నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

|| 13-29 ||
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.

|| 13-30 ||
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి

అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు.

|| 13-31 ||
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.

|| 13-32 ||
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

|| 13-33 ||
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే

ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.

|| 13-34 ||
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత

ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింప చేస్తాడో, అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.

|| 13-35 ||
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా|
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్

ఈ ప్రకారంగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని చేరుకుంటారు.

|| 13 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు:
ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అనగా ఏమిటి?

కృష్ణుడు:
దేహాన్ని క్షేత్రమని, దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు. నేనే క్షేత్రజ్ఞున్ని. క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను విను. ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు. బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలు, ఇష్టద్వేషాలు, తెలివి, ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు.


అభిమానము, డంబము లేకపోవడం, అహింస, ఓర్పు, కపటం లేకపోవడం, గురుసేవ, శుచిత్వం, నిశ్చలత, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం, నిరహంకారం, ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాతృడిగా గుర్తించడం, భార్యాబిడ్డలందు, ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం, శుభాశుభాల యందు సమత్వం, అనన్య భక్తి నాయందు కల్గిఉండడం, ఏకాంత వాసం, నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది. దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం.


సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మం ను తెలుసుకొంటే మోక్షం వస్తుంది. ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది. ఈ పరబ్రహ్మతత్వం అన్నిటియందు కలిసిఉన్నట్లు కనిపించినా దేనితోనూ కలవదు. కాని అన్నిటినీ భరిస్తూ పోషిస్తోంది. నిర్గుణమై ఉండీ గుణాలను అనుభవించేదీనని తెలుసుకో.

అది సర్వభూతాలకూ లోపలా, బయట కూడా ఉంది. అది సూక్షం. తెలుసుకోవడం అసాధ్యం. గుర్తించిన వారికి సమీపంలోనూ, మిగతావారికి దూరంలో ఉంటుంది. ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది. సృష్టిస్థితిలయ కారకం అదే. అది సూర్యుడు, అగ్నులకు తేజస్సును ఇస్తుంది. చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, జ్ఞేయం, సర్వుల హృదయాలలో ఉండేది. జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రం ఈ మూడూ తెలుసుకొన్న వాడు భక్తుడై మోక్షం పొందగలడు. ప్రకృతి పురుషులు తెలియబడని మొదలు గలవి. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖదుఃఖాలు ప్రకృతి వలనే పుడుతున్నాయి. దేహ, ఇంద్రియాల పనికి ప్రకృతి-సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు మూలం. జీవుడు త్రిగుణాల వలన సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం. తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు, స్వతంత్రుడు, అనుకూలుడు, సాక్షి, పోషకుడు, భోగి ఐన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఈ విషయాలను గురించి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు. కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మబుద్దితో హృదయంలోనూ, మరికొందరు యోగధ్యానం వలనా, జ్ఞానయోగం వలనా, కొందరు నిష్కామయోగం ద్వారా దర్శిస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం తెలియనివారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా సంసారాన్ని తరిస్తారు. ఈ ప్రాణులంతా క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక కారణం. అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగినవాడు మాత్రమే నిజంగా చూసినవాడు. ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడుచేసుకోడు. పరమగతిని పొందుతాడు. ఆత్మ ఏ కర్మా చేయదనీ, ప్రకృతే చేస్తుందని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అన్ని జీవులనూ ఆత్మగా చూస్తూ ఆనీ ఆత్మ అని గ్రహించిన మనిషే బ్రహ్మత్వం పొందుతాడు. పుట్టుక, గుణం, వికారం లేనిది కావడం చే శరీరమందున్నా కర్తృత్వం కానీ, కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు. శరీరగుణాలు ఆత్మకు అంటవు. ఒక్క సూరుయ్డే జగత్తును ప్రకాశింప చేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, మాయాబంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకొన్నవాడే పరమగతినీ పొందుతాడు.